Singer Sunita: కల్లు తాగిన సింగర్!

224

Singer Sunita: తెలుగు సినీ సింగర్ సునీత మరో యాంకర్, మరికొందరు సెలబ్రిటీలతో కలిసి సరదాగా కల్లు తాగి కాస్త సేదతీరారట. తాజాగా వీరందరినీ కూడా ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆహ్వానించారట. ఈ కార్యక్రమం ఓ రిసార్టులో జరుగగా అక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉండటంతో గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీతతో పాటుగా తోటి షో కళాకారులు కల్లును గ్లాసులలో తాగారు. ప్రస్తుతం సునీతతో పాటు మిగతా సెలబ్రిటీలు కల్లు తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీత, ప్రముఖ వ్యాపారవేత్త రామ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం సునీత సెకండ్ ఇన్నింగ్స్ చాలా సంతోషంగా గడుపుతున్నట్టు ఇటీవలే ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.