ప్రభాస్ సలార్ లో శృతి.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన యూనిట్

189

లవ్.. బ్రేకప్.. హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడిన హాసన్ డాటర్ శృతి ఇప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఈ మధ్యనే రవితేజతో నటించిన క్రాక్ సినిమా రిలీజై మంచి ఫలితం దక్కించుకోగా విజయ్ సేతుపతి సరసన లాభం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించిన వకీల్ సాబ్ వేసవిలో రిలీజ్ కానుండగా మొత్తంగా వరసగా శృతి కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో ప్రభాస్ పాన్ ఇండియా క్రేజీ ఫిల్మ్ సలార్ లో కూడా అఫర్ కొట్టేసింది. ఈ విషయాన్ని ఆ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

నేడు శృతి హాసన్ బర్త్ డే. అందుకే సలార్ యూనిట్ సలార్ సినిమా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఒక ట్వీట్ చేసింది. తమ టీంలోకి ఆహ్వానిస్తున్నామని శృతికి వెల్ కమ్ చెప్పింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదలు కాకుండానే భారీ క్రేజ్ దక్కించుకోగా ఇందులో శృతికి అఫర్ దక్కడం అంటే పెద్ద విషయమేనని చెప్పాలి. అయితే.. ప్రభాస్ కు జోడీగానే నటిస్తుందా లేక మరేదైనా పాత్ర కోసమా అన్న విషయాన్ని అటు యూనిట్ గానీ ఇటు శృతి కానీ క్లారిటీ ఇవ్వలేదు.

ప్రభాస్ సలార్ లో శృతి.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన యూనిట్