ఔను.. మళ్ళీ ప్రేమలో పడ్డానంటున్న శృతి బేబీ!

168

అంటే అన్నామంటారు కానీ సినిమా వాళ్ళు ప్రేమలో ఉన్నామని ఎన్నిసార్లు చెప్తారో ఎవరం చెప్పడం కష్టం. ఓ ఏడాది నిండా ప్రేమలో మునిగితేలి తూచ్ బ్రేకప్ అని చెప్పేసి మళ్ళీ కొత్త రిలేషన్ స్టార్ట్ చేయడం నటీనటులకు కామన్ అనుకోవాల్సి పరిస్థితి తెలెత్తింది. అందరూ అలానే ఉన్నారని చెప్పలేం కానీ బ్రేకప్ లైట్ తీసుకుంటారనే టాక్ మాత్రం స్టాంగ్ గా ఉంటూ వస్తుంది. ఇక లోకనాయకుడు కమలహాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఇప్పటికే ఒకసారి ప్రేమలో మునిగితేలడం.. బ్రేకప్ తో ఇండస్ట్రీకి కూడా కొన్నాళ్ళు పాటు దూరంగా ఉండడం జరిగింది.

పరిచయం.. ప్రేమ ఎలా అన్నది అనవసరం కానీ మైఖేల్ కోర్సలే అనే విదేశీయుడితో శృతి అప్పట్లో ప్రేమ గీతాలు ఆలపించింది. అదే ఏమైందో ఏమో కానీ తనతో బ్రేకప్ చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో విస్కీకి బాగా అలవాటు పడిన ఈ చిన్నది ఆ డిప్రెషన్, మత్తు నుండి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. మొత్తంగా ఇప్పుడు వాటికి దూరంగా మళ్ళీ కెరీర్ మీద దృష్టిపెట్టింది. ఈ మధ్యనే రవితేజతో నటించిన క్రాక్ రిలీజై మంచి ఫలితం దక్కించుకోగా సేతుపతి సరసన లాభం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక పవన్ సరసన నటించిన వకీల్ సాబ్ వేసవిలో రిలీజ్ కానుండగా మొత్తంగా వరసగా శృతి కెరీర్ ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. అయితే.. తాజాగా ఔను మళ్ళీ ప్రేమలో పడ్డా అంటూ మరో బాంబు పేల్చేసింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో నెటిజన్లతో ముచ్చటిస్తున్న శృతి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిజమే ప్రేమలో పడ్డానని చెప్పింది. అంతేకాదు.. తన పాత బాయ్ ఫ్రెండ్ మీద కూడా ఎలాంటి కోపం లేదని.. గతం గతహా అనేసింది. అంటే.. అమ్మడి మాటలు చూస్తుంటే మళ్ళీ ప్రేమ మైకంలో మునిగితేలుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈసారైనా ఈ ప్రేమాయణం తీరానికి చేరుతుందా లేదా చూడాల్సి ఉంది.

ఔను.. మళ్ళీ ప్రేమలో పడ్డానంటున్న శృతి బేబీ!