శోభనం రోజు గొడవ నవవధువు ఆత్మహత్యయత్నం

91

హైదరాబాద్ నగరంలో నవ వధువు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెళ్లి జరిగిన నాలుగు రోజులకే నవ వధువు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేటన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామానికి చెందిన సాక స్వాతి ప్రగతి నగర్ లో నివాసముంటున్నారు. స్వాతి తన పెద్ద కుమార్తె సౌజన్యను గ్రామా వాలంటీర్ వెంకటేశ్వర రావుకి ఇచ్చి పెళ్లి చేసింది. డిసెంబర్ 6 న వీరి వివాహం జరగ్గా డిసెంబర్ 9 న శోభనానికి ఏర్పాట్లు చేశారు.

అయితే 10వ తేదీ ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, వధువు నిరాకరణకు కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లి స్వాతికి చెప్పాడు. ఈ మాటలు విన్న సౌజన్య మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లోంచి సౌజన్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

శోభనం రోజు గొడవ నవవధువు ఆత్మహత్యయత్నం