రాజకీయాలకు చినమ్మ గుడ్ బై.. షా చక్రం తిప్పరా?

311

వివేకానందన్ కృష్ణవేణి శశికళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాజకీయాలకు తానూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడు దివంగత నేత జయలలిత సన్నిహితురాలైన శశికళ బుధవారం రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. జయలలిత ఉన్న సమయంలో అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆమె మరణం తర్వాత నాలుగేళ్లు జైలుకు వెళ్లారు. ఈ మద్యే జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఈమెకు ఘనస్వాగతం పలికారు. శశికళ తమిళనాడులో అడుగుపెట్టడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అన్నాడీఎంకే బాధ్యతలు శశికళ తీసుకునే అవకాశం ఉందని అందరు భావించారు.

కానీ ఆ పార్టీ నేతలు ఆమెను దగ్గరకి కూడా రానివ్వలేదని తెలుస్తుంది. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసినా అవి బెడిసికొట్టడంతో చివరకు రాజకీయాల నుంచే తప్పుకునేందుకు చిన్నమ్మ నిర్ణయం తీసుకుంది. ఇక ఆమె రాజకియాకు దూరమవుతున్నట్లుగా ప్రకటించి చివరగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ అధినేత్రి జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తానన్నారు. అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంతో పనిచేసి జయలలిత బంగారు పాలన కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు.‘రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా సోదరి, నేను దైవంగా పరిగణించే పురచ్చితలైవి బంగారు పాలన కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శశికళ జయలలితకు సన్నిహితురాలుగా ..

జయలలిత నెచ్చెలిగా నీడలా వెన్నంటి ఉండి పార్టీ రాజకీయాల్లో శశికళ తనదైన ముద్రవేశారు. పార్టీలో అన్ని వ్యవహారాలు చూసుకునేది జయలలిత అయిన శశికళకు చెప్పకుండా ఆమె ఏ నిర్ణయం తీసుకునేవారు కాదని ఆపార్టీ నేతలే చెబుతుంటారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా చిన్నమ్మ కలుగచేసుకునే వారని చెబుతున్నారు. అమ్మ మరణం తర్వాత ప్రధాన కార్యదర్శిగా మారి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. నాటి సీఎం పన్నీర్‌సెల్వం చేత రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ లోపే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తెరపైకి రావడంతో జైలుకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ పళనిస్వామిని సీఎంని చేసి వెళ్లారు.

శశికళను మందలించిన దినకరన్

ఏప్రిల్ లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే, బీజేపీతో కలిసి బరిలో దిగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకంపై చర్చ నడుస్తుంది. తమకు 60 సీట్లు కేటాయిస్తే అందులో 50 శాతం శశికళ వర్గానికి ఇస్తామని బీజేపీ బేరం పెట్టింది. అదే జరిగితే పార్టీ పగ్గాలు మెల్లమెల్లగా ఆమె చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావించిన అన్నాడీఎంకే అందుకు ఒప్పుకోలేదు. బీజేపీ నిర్ణయాన్ని దినకరన్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ ద్వారా పొందే సీట్లలో కమలం గుర్తుపై పోటీచేయాలన్న అమిత్‌షా షరతును దినకరన్‌ తోసిపుచ్చారు. అన్నాడీఎంకే అంత అయిష్టతను కనబరుస్తున్నపుడు ఆ కూటమి నుంచి పోటీకై బీజేపీ వద్ద సాగిలపడాల్సిన అవసరం లేదని దినకరన్‌ శశికళను గట్టిగా మందలించారు. దినకరన్ మందలింపుతో శశికళ రాజకీయాలకు దూరమైందని తెలుస్తుంది.

రాజకీయాలకు చినమ్మ గుడ్ బై.. షా చక్రం తిప్పరా?