శశికళకు షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం… ఆస్తులు జప్తు

238

అక్రమాస్తుల కేసులో అరెస్టై నాలుగేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపిన శశికళ సోమవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆమె అభిమానులు ఘనస్వాగతం పలికారు. 5000 కార్లతో ర్యాలీ తీశారు.. ఇక ఈ సందర్బంగా శశికళ మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ తనదే అని, తాను ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించింది. ప్రకటన చేసిన 24 గంటల్లోనే శశికళకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. కాగా 2017లో ఆస్తుల జప్తుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శశికళ కండించారు… తనను రాజకీయంగా ఎదురుకోలేక ఇటువంటి ఉత్తర్వులు జారీచేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తనను అడ్డుకోలేవని తెలిపింది. త్వరలో పర్యటనలు చేస్తానని ప్రకటించింది. కాగా త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

శశికళకు షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం… ఆస్తులు జప్తు