ఆసుపత్రిలో చేరిన శశికళ

233

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అక్రమాస్తుల కేసులో గత నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే ప్రస్తుతం ఆమె బెంగళూరు పరప్పన జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మొదట బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్ట్ తోపాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడినుంచి ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతోపాటు మంచి ప్రవర్తన వల్ల ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అయితే తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శశికళ బయటకు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల మునుఁడు జైలు నుంచి వస్తుండటంతో జరగబోయే ఎన్నికలపై శశికళ ప్రాభవం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శశికళ బయటకు వస్తే జయలలిత పార్టీలో ఉంటారా లేదా అనేది తెలియాలి. అసలు రాజకీయాలు చేస్తారా లేదా? అనేది కూడా సందేహమే.