Sharwanand Birthday: సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్!

585

Sharwanand Birthday: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నేడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. నేటితో 37 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే శుక్రవారం తన కొత్త సినిమా శ్రీకారం ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. కాగా నేడు తన పుట్టినరోజు జోష్ లో ఉన్న ఈ హీరో బర్త్ డేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెలబ్రేట్ చేశాడు.

శర్వా, చెర్రీ ఇద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు. రానాతో సహా ఈ ఇద్దరూ స్కూల్ మేట్స్. ఇండస్ట్రీలో కూడా రామ్ చరణ్, శర్వానంద్ రెగ్యులర్ టచ్ లో ఉంటారు. అందుకే తన ఫ్రెండ్ పుట్టినరోజున రామ్ చరణ్ గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోల‌ను శర్వా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ చ‌ర‌ణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. వీలైనంత త్వరగా ఓ ఇంటి వాడు కావాలనుకుంటున్న శర్వా ప్రస్తుతం వధువు వేటలో ఉన్నాడు.

రామ్ చరణ్ భార్యా ఉపాసన స్నేహితురాలిని శర్వా మనువాడనున్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ పెళ్లివేడుక జరగనుందని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం శర్వా శ్రీకారం, మ‌హా స‌ముద్రం చిత్రాల‌తో పాటు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ఆచార్యలో ఒక కీలక పాత్రతో పాటు రాజమౌళి మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు.