షర్మిల ఖమ్మం టూర్ వాయిదా

249

వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటు కోసం చకచకా అడుగులు వేస్తున్నారు. వైఎస్ అభిమానులతో ఆమె భేటీ అవుతూ పార్టీ పేరు, విధివిధానాలపై చర్చిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె తోలి పర్యటన ఖమ్మం జిల్లాలో చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు ఫిబ్రవరి 21 న ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే షర్మిల ఈ పర్యటనకు వాయిదా వేశారు.

తెలంగాణలో మార్చి 14 న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఆమె ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లో ప్రతి శుక్రవారం అభిమానులతో షర్మిల భేటీ కానున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభిమానులతో షర్మిల సమావేశాలు జరపనున్నారు. ఇక ఇప్పటికే ఆమె నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. చేవెళ్ల నేతలతో కూడా భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా కలిసినట్లు సమాచారం.

షర్మిల ఖమ్మం టూర్ వాయిదా