జగన్ చెప్పిన వినకుండా షర్మిళ పార్టీ పెడుతున్నారు.

143

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, జగన్ సోదరి వైఎస్ షర్మిళ తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఈ మేరకు మంగళవారం నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలతో ఆమె భేటీ అయ్యారు. పార్టీ పేరు రిజిస్టర్ చేయిస్తామని తెలిపారు. పార్టీ పేరు YSRTP నామకరణం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే షర్మిళ రాజకీయ పార్టీ పెట్టడంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అయాన్, పార్టీ పెట్టొద్దని షర్మిళకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.

షర్మిళ తమ ఆత్మీయ సోదరని, గత మూడు నెలలుగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన సజ్జల తెలిపారు. తెలంగాణాలో వైసీపీ లాంటి పార్టీ ఉండాలని షర్మిళ భావిస్తుందని సజ్జల తెలిపారు. తెలంగాణలో వైసీపీని బలపరిస్తే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని భావించి పార్టీని తెలంగాణలో విస్తరించలేదని తెలిపారు. షర్మిళను పార్టీ పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని, జగన్‌, షర్మిళ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిళ పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారన్నారు.

జగన్ చెప్పిన వినకుండా షర్మిళ పార్టీ పెడుతున్నారు.