అమ్మకాల జోరు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

152

బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం కుప్పకూలింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్ల జోష్ తో 50000 మార్క్ దాటినా సెన్సెక్స్ ఈ రోజు 740 పాయింట్లు నష్టం చవిచూసింది. సాయంత్రం 3:30 నిమిషాల వరకు సెన్సెక్స్ 746 పాయింట్లు నష్టపోయింది. దింతో 48,878 వద్ద కొనసాగుతుంది. ఇక నిఫ్టీ కూడా 200 పాయింట్లు నష్టపోయింది. 14,371 వద్ద కొనసాగుతుంది. మార్కెట్లో లాభాలకు ఆశపడిన మదుపరులు అమ్మకాల వైపు మళ్లారు. దింతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో అమ్మకాలు అధికంగా ఉన్నాయి. దింతో స్టాక్స్ ఢమాల్ అన్నాయి.

అమ్మకాల జోరు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్