టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన శాంత బయోటెక్ చైర్మన్

235

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) ట్రస్ట్‌కు శాంత బయోటెక్ చైర్మన్ కెఎల్ వరప్రసాద్ రెడ్డి భారీ విరాళం అందజేశారు.. శుక్రవారం తన సతీమణితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న వరప్రసాద్ రెడ్డి.. అనంతరం రూ. కోటి రూపాయల చెక్కును తిరుమలలోని రంగనాయకుల మండపం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని టీటీడీకి అలాగే ఎస్విబిసికి వినియోగించాలని సుబ్బారెడ్డిని కోరినట్టు తెలుస్తోంది.

కాగా వాణిజ్య ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.. నిర్వహణకు అయ్యే ఖర్చులను భక్తుల నుండి విరాళాల రూపంలో స్వీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కోట్ల రూపాయల విలువైన విరాళాలను స్వీకరిస్తూనే ఉంది. టీటీడీ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్విబిసి ట్రస్ట్ గత 3 నుండి 4 నెలల్లో విరాళాల రూపంలో సుమారు రూ.14.5 కోట్లను సమకూర్చుకుంది.