విషాదం :- శాంటాకు కరోనా.. గిఫ్ట్‌లు అందుకున్న 18 మంది మృతి

92

బెల్జియంలో విషాద ఘటన జరిగింది. క్రిస్మస్ కు శాంటా క్లాజ్ నుంచి బహుమతులు అందుకున్న 18 మంది మృతి చెందారు. దీనికి కారణం శాంటాకు అప్పటికే కరోనా సోకడమే. కాగా క్రిస్మస్ సమయంలో శాంటాలు చేసే సందడి అంత ఇంత కాదు. వీరు అందరిని నవ్విస్తుంటారు. బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది కరోనాను లెక్క చెయ్యకుండా క్రిస్మస్ వేడుకలు జరిగాయి.

ఈ నేపథ్యంలోనే బెల్జియంలోని ఓ వృద్ధాశ్రమంలోని సిబ్బంది అక్కడి వృద్దులకు క్రిస్మస్ సందర్బంగా కాస్త వినోదాన్ని పంచేందుకు ఆశ్రమంలో డాక్టర్ గా ఉన్న వ్యక్తిని శాంటాగా మార్చారు. అతడి చేతులమీదుగా వృద్దులకు గిఫ్ట్ పంపిణి చేశారు. దింతో వృద్దాశ్రమంలోని 121 మంది వృద్దులకు 36 మంది సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 18 మంది మృతి చెందారు. మరికొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా వీరికి శాంటా ద్వారానే కరోనా సోకినట్లు నిర్దారించారు. గతంలోనే వైద్యుడికి కరోనా సోకిందని, కానీ అతడికి ఆ విషయం తెలియదని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. వృద్దులు అనారోగ్యానికి గురవుతుండటం, డాక్టర్ కు జ్వరం వస్తుండటంతో పరీక్షకు చేస్తే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. శనివారం నుంచి పరీక్షలు చేయగా మొత్తం ఆశ్రమంలో 157 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వీరిలో 18 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మరికొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వివరించారు. కాగా దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వృద్దులకు ఆశ్రమంలోనే వైద్యం అందిస్తున్నారు. కరోనా సోకినవారిని ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

విషాదం :- శాంటాకు కరోనా.. గిఫ్ట్‌లు అందుకున్న 18 మంది మృతి