ఆనంకు అవమానం.. ఆగ్రహంతో ఊగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే!

193

తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కోసారి అధికారులు కూడా తప్పిదాలు చేస్తుంటారు. అయితే.. అవి అధికార పార్టీ నేతల విషయంలో కనుక జరిగితే నానా రాద్ధాంతం అయిపోద్ది. అందుకే దాదాపుగా అధికార వర్గాలు ఇలాంటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులను పిలవాల్సి ఉంది. దాన్నే ప్రోటోకాల్ నిబంధన అంటారు. తాజాగా రిపబ్లిక్ డే రోజున ఏపీలో జెండా వందనం కార్యక్రమాన్ని ఏ శాఖ అధికారులు ఆ శాఖ పరిధిలో.. జిల్లా అధికారులు జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించారు.

జెండా వందనం కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అధికారులు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జిల్లా సీనియర్ నేత అయిన ఆనం రాంనారాయణరెడ్డిని ఆహ్వానించడం మర్చిపోయారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జిల్లా ప్రతినిధులను సైతం గణతంత్ర వేడుకలకు పిలవరా? ఇది నిర్లక్ష్యమా.. అహంకారామా అంటూ ఊగిపోయిన ఆనం అధికారులను నిలదీశారట. దీనికి సమాధానం చెప్పేంత పేదవాళ్లం మేము కాదంటూ అధికారులు పక్కకి తప్పుకోవడంతో ఇప్పుడు అయన కోపం నషాళానికి అంటింది.

మొత్తంగా ఎమ్మెల్యే రాంనారాయణ రెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసైనా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కొంతకాలంగా ఆనం రాజకీయాలలో పెద్దగా దూకుడుగా కనిపించడం లేదు. ఈ మధ్యనే మంత్రి బొత్స సత్యనారాయణ ఆనంను కలిసి జిల్లాలో రాజకీయ వ్యవహారాలపై చర్చలు కూడా జరిపారు. పెద్దగా యాక్టివ్ లేరనే అధికారులు ఆయనను విస్మరించారో.. లేక అందుబాటులో లేరని గమనించలేదో కానీ ఆహ్వానం పంపలేకపోయారు. జాతీయ వేడుకలో విషయంలో ఇంత రాద్ధాంతం కూడా అవసరమా అంటే అది ఎమ్మెల్యేగారికే తెలియాలి.

ఆనంకు అవమానం.. ఆగ్రహంతో ఊగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే!