షారుక్ ఖాన్ సినిమా షూటింగ్ లో ఘర్షణ.. దర్శకుడి చెంప పగలకొట్టిన అసిస్టెంట్

581

సినిమా షూటింగ్ అన్న తర్వాత చిన్నపాటి గొడవలు సర్వసాధారణం. దర్శక, నిర్మాతల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు బాగానే ఉన్నాయి. ఇక కొట్లాట వరకు వెళ్లిన ఘటనలు చాలా తక్కువే. అయితే షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ చిత్ర షూటింగ్ లో గొడవ జరిగిందట.. గొడవ కాస్త ఘర్షణకు దారితీయడంతో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఘర్షణకు దిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే షూటింగ్ సమయంలో ఎవరు మొబైల్ ఫోన్స్ తెచ్చుకోవద్దని దర్శకుడు చిత్ర బృందానికి తెలిపారు. దింతో అందరు తమ మొబైల్స్ హోటల్ రూల్ లో పెట్టి సెట్స్ లోకి వచ్చారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం తన వెంట ఫోన్ తెచ్చుకున్నాడు. దింతో అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొదట డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ను కొట్టడంతో, అతడు తిరిగి డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించారు.

అంతటితో ఆగని అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ ఉన్న వారిపై దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ దగ్గరకు వెళ్లడంతో ఆ అసిస్టెట్ డైరెక్టర్ ని విధుల నుంచి తప్పించారంట. సెట్స్ లో రచ్చ జరగడంతో షూటింగ్ ను ఒక రోజు వాయిదా వేశారు చిత్ర బృందం.. ఈ ఘర్షణతో డైరెక్టర్ మూడ్ మొత్తం అప్సెట్ అయినట్లుగా తెలుస్తుంది. ఒకరోజు విరామం అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.

షారుక్ ఖాన్ సినిమా షూటింగ్ లో ఘర్షణ.. దర్శకుడి చెంప పగలకొట్టిన అసిస్టెంట్