సంచలన తీర్పు.. బుగ్గ గిల్లడం నేరం కాదు.

470

ఈ మధ్య కోర్టులు ఇస్తున్న తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌ గ్‌పూర్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా ఓ తీర్పు వెలువరించింది. చిన్న పిల్లల ప్యాంటు జిప్పు తీస్తే అది లైంగిక వేధింపుల కిందకు రాదని తెలిపింది. ఇక శుక్రవారం ఇటువంటిదే మరో తీర్పు ఇచ్చింది ముంబై ప్రత్యేక కోర్టు. బుగ్గలు గిల్లుతూ 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న 28 ఏళ్ల టెక్నీషియన్‌ను మంగళవారం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బుగ్గలు గిల్లడం లైంగిక వేధింపుల కిందకు రాదని తెలిపింది కోర్టు..

చిన్నారి తల్లి చిప్పిన వివరాల ప్రకారం

ఫ్రిజ్ రిపేర్ పనిచేయడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో 2017లో ఓ వ్యక్తి ఫ్రిజ్ రిపేర్ చేసేందుకు ఇంటికి వచ్చాడు. అవసరమైన స్పేర్‌ పార్ట్స్‌ తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి బుగ్గలు గిల్లాడు. బుగ్గగిల్లడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ చిన్నారి తల్లి. అనంతరం ఆమె కిచెన్ లోకి వెళ్ళింది. ఇక ఆమె వంట గదిలో పనిలో ఉండగా టెక్నిషియన్‌ వచ్చి ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. భయంతో బిగుసుకుపోయిన సదరు మహిళ అతడిని పక్కకు తోసి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఆమెను వదలకుండా అలాగే పట్టుకున్నాడు. దాంతో ఆమె సూపర్‌వైజర్‌ని పిలిచింది. అతడు వచ్చి టెక్నిషియన్‌ని బటయకు గెంటే ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.

వెంటనే సదరు మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.. ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు టెక్నిషియన్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అతడికి లైంగిక వేధింపుల నేరం కింద ఏడాది జైలు శిక్ష విధించింది. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే చిన్నారిపై లైంగిక వేధింపులు ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. దురుద్దేశం లేకుండా చిన్నారి బుగ్గలు గిల్లడం నేరం కాదని వెల్లడించింది. అతడిపై చిన్నారి తల్లి చేసిన ఆరోపణలు నిరూపితం కాలేదు.. సదరు మహిళను అతడు కౌగిలించుకున్నట్లుగా కోర్టుకు ఆధారాలు అందించలేకపోయారు. దింతో కోర్ట్ అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

సంచలన తీర్పు.. బుగ్గ గిల్లడం నేరం కాదు