రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలను వెల్లడించిన నిమ్మగడ్డ

199

ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ ఎన్నికల సమరం ముగిసింది. రెండోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. రెండోదశ నామినేషన్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 13 జిల్లాలో 539 పంచాయితీ ఏకగ్రీవమయ్యాయి.. మొదటి విడతలో 525 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. రెండోదశలో ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. ఇక జిల్లాల వారీగా ఏకగ్రీవాల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 57, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 41, కడప జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 36, విశాఖ జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని స్పష్టం ఎన్నికల కమిషన్ చేసింది.

రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలను వెల్లడించిన నిమ్మగడ్డ