ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ : హాజరుకాని అధికారులు

228

పంచాయితీ ఎన్నికలపై చర్చించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా.. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, పంచాయితీ రాజ్ అధికారులు హాజరుకాలేదు.. సీఎస్ నుంచి కలెక్టర్లకు కూడా సమాచారం అందలేదు.. దాంతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికల కమిషన్‌కు ఉద్యోగులు సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.