గవర్నర్ తో ఎస్ఈసి నిమ్మగడ్డ భేటీ

74

ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ తో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తాజా పరిణామాలను గవర్నర్ కు వివరించారు నిమ్మగడ్డ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, హైకోర్టు తీర్పు వివరాలను వివరించారు. ఎట్టి పరిస్థితులలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని గవర్నర్ తో అన్నట్టు తెలుస్తోంది. కాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.