గవర్నర్ కు మాట ఇచ్చిన ఎస్ఈసీ రమేష్ కుమార్

145

ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల రచ్చ ఇంకా కొలిక్కి రాలేదు. హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లిన రమేష్ కుమార్ 20 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్ తో చర్చించారు.

హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో పిటిషన్, ఎన్నికల ప్రక్రియ, ఎలెక్షన్ షెడ్యూల్ తదితర వివరాలను గవర్నర్ కు ఎస్ఈసీ వివరించారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ధర్మాసనం తొలగించిన విషయం గురించి చెప్పారు. పంచాయితీ ఎన్నికలు ఎందుకు జరపాలి అనే దానిపై వివరణ ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కు ఆటంకాలు లేకుండా, ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఎన్నికలను నిర్వహిస్తామని గవర్నర్ కు మాట ఇచ్చారు రమేష్ కుమార్

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం మాజీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ తో రమేష్ కుమార్ భేటీ కానున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రమేష్ కుమార్ తో భేటీకి ముందు జగన్ తో భేటీ కావడంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గవర్నర్ కు మాట ఇచ్చిన ఎస్ఈసీ