ఎస్ఈసీ కీలక నిర్ణయం.. ద్వివేది, గిరిజా శంకర్‌పై చర్యలు

143

ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో ఎస్ఈసీ రమేష్ కుమార్ ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఒకవైపు ఎన్నికల ప్రక్రియను ముమ్మరం చేస్తూనే తనకు సహకరించని.. ఎన్నికలపై ఆసక్తి చూపని అధికారులపై వేటు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై ఎస్ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని.. ముఖ్యంగా ఈ ఇద్దరి అలసత్వం కారణంగానే నూతన ఓటర్ల జాబితా అందుబాటులోకి రాలేదని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారన్నారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించిన అయన సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 జాబితాతోనే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.