ఎస్ఈసి ఈ వాచ్ యాప్ పై 17వరకు నిషేధం పొడిగింపు

138

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీహైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పంచాయతి ఎన్నికలు సందర్బంగా ఆయన వ్యక్తిగతంగా తయారుచేయించిన ఈ-వాచ్ యాప్ పై నిషేధాన్ని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతవరకూ ఈ-వాచ్ స్థానంలో నిఘా లేదా సీ. విజిల్ యాప్ వినియోగించుకోవచ్చని ఎస్ఈసీకి కోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి 17న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. కాగా ప్రతిపక్ష టీడీపీకి మేలుచేయాలన్న దురుద్దేశంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ ను తయారు చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.