అమెజాన్ ప్రైమ్ వీడియో, మీర్జాపూర్ మేకర్స్ కు ‘సుప్రీం’ నోటీసులు

134

అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫాంలో సంచలనం సృష్టించిన మీర్జాపూర్ సినిమా మేకర్స్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ధారావాహికలో అస్లీలత వలన యుపిలోని మిర్జాపూర్ నగరానికి చెడ్డపేరు వస్తుందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందన కోరుతూ మీర్జాపూర్ నిర్మాతలు, అమెజాన్ ప్రైమ్ వీడియో కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

అయితే అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో వెబ్ సిరీస్ నిర్మాత, అమెజాన్ ప్రైమ్ వీడియోపై సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, అరవింద్ చతుర్వేది కొట్వాలి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ మత, సామాజిక , ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీస్తుందని , సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ‘మిర్జాపూర్’ సిరీస్ గత సంవత్సరం విడుదలైనప్పటి నుండి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.