ఎస్బీఐ బంపర్ ఆఫర్..బ్యాంకుకి వెళ్ళేపనిలేకుండా 20 లక్షల లోన్

354

కరోనాతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.. కుటుంబాలు కూడా ఆర్ధికంగా చితికిపోయాయి. ఈ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు పోయాయి. చాలామంది ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. ఇక కొన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాలు తగ్గించి నెట్టుకొచ్చాయి. ఇటువంటి పరిస్థితిల్లో సామాన్యుడిపై పెను భారం పడింది. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని SBI లోన్స్ ఇస్తామని ప్రకటించింది. కేవలం 4 క్లిక్స్ తో పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది ఎస్బీఐ వడ్డీ కూడా చాలా తక్కువే.. ఇంటి లోన్ కి వేసే వడ్డీనే పర్సనల్ లోన్ కి కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే గతంలో పర్సనల్ లోన్ పై 12 నుంచి 16 శాతం వడ్డీ విధించే వారు. ప్రజల పరిస్థితితిని దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ వడ్డీ కూడా తగ్గించింది.

కేవలం 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ. అయితే ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్. అంటే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. ముందుగానే రుణాలు మంజూరు చేసి కస్టమర్లకు సమాచారం ఇస్తాయి. వీటినే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు. కస్టమర్లు తమకు అవసరమైతే ఈ రుణాలను సులువుగా తీసుకోవచ్చు. అయితే ఇటువంటి లోన్ అనేక ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ అధిక వడ్డీ వసూలు చేస్తారు. ఎస్బీఐలో చాలా తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.

ఎస్బీఐ బంపర్ ఆఫర్..బ్యాంకుకి వెళ్ళేపనిలేకుండా 20 లక్షల లోన్