ఎస్బీఐ ఉద్యోగిని దారుణ హత్య

70

అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మంగళవారం బ్యాంకుకి వెళ్లిన స్నేహలత రాత్రి అయిన తిరిగిరాలేదు. దింతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్నేహలత కోసం గాలించారు. బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బండన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా తమ కూతురు స్నేహలతని రాజేష్, కార్తీక్ అనే యువకులే హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమ పేరుతొ తమ కూతురు స్నేహలతని వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దుండగులు హత్య అనంతరం పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పు అంటించినట్లుగా తెలుస్తుంది.

ఇక రాష్ట్రంలో ప్రేమపేరుతో యువతులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ రెండు మూడు నెలల్లోనే పదిమందికి పైగా యువతులు ప్రేమ పేరుతో బలయ్యారు. కృష్ణా, విశాఖ, గుంటూరు జిల్లాలో ప్రేమ హత్యలు అధికంగా జరిగాయి. తమను ప్రేమించడం లేదన్న అక్కసుతోనే కొందరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

ఎస్బీఐ ఉద్యోగిని దారుణ హత్య