ఉత్తరాఖండ్‌ ముంగిట మరో ముప్పు

323

ఉత్తరాఖండ్ లో నందాదేవి పర్వతం నుంచి మంచు కొండ చరియ విరిగి రిషిగంగా నదిలో పడటంతో నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది దింతో 170 మంది వరకు గల్లంతయ్యారు. వీరిలో 38 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రిషిగంగా నది ఉదృత ప్రవాహానికి ఓ దగ్గర సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైంది. నదిలో నీటి ప్రవాహానికి రాళ్ళూ, మట్టిగడ్డలు కొట్టుకొచ్చి ఓ దగ్గర కృత్రిమ సరస్సు తయారైంది.

అయితే దీనివలన ప్రమాదం పొంచి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌, (DRDO) నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (NDRF‌) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు.

ఉపగ్రహ చిత్రాల్లో బయటపడిన ప్రాంతంలో ఈ సరస్సు ఎలా ఉంది. ఎంత ఉధృతితో ప్రవహిస్తుంది అని తెలుసుకునేందుకు ఇప్పటికే బృందాలను పంపినట్లు ప్రధాన్ తెలిపారు. డ్రోన్ కెమెరాలు, మానవ రహిత విమానాలను పంపినట్లు తెలిపారు. ఈ సరస్సు ప్రవాహం ఉదృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, దీనిపై drdo, ndrf పనిచేస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్ తెలిపారు.

అయితే ఈ సరస్సు మూడు ఫుట్ బాల్ గ్రౌడ్ల పరిమాణంలో ఉందని, 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్నట్లు గుర్తించారు. ఈ సరస్సు చాలా ప్రమాదకరంగా ఉందని ఘర్వాల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వైపీ సండ్రియల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘తాను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నానని. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది.. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని తెలిపారు.

స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎన్‌టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. దీని కారణంగా తాము భూములను కోల్పోయామని, ప్రస్తుతం సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వలన తమ ప్రియమైన వారిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని,, వారు బ్రతికి ఉన్నారో లేదో అన్న సమాచారం కూడా లేదని కన్నీరుమున్నీరవుతున్నారు

ఉత్తరాఖండ్‌ ముంగిట మరో ముప్పు