చిన్నమ్మ విడుదల.. ఆసుపత్రిలోనే ఫార్మాలిటీస్ పూర్తి!

84

అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ నేడు జైలు నుండి విడుదల అయ్యారు. అవినీతి కేసులో గత నాలుగేళ్లగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ప్రస్తుతం కరోనా సోకి బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉండగానే జైలు శిక్ష పూర్తి కావడంతో ఆసుపత్రి నుండే విడుదలకు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. జనవరి 20న ఆమెకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాగా మరో పది రోజుల పాటు ఆమెకు చికిత్స అవసరం అని ఆమె బంధువులు తెలిపారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నా పదిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు వెల్లడించగా బుధవారం ఉదయం ఆమె జైలు నుండి విడుదల పూర్తి చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం ఆమె చెన్నై రానుండగా చిన్నమ్మ రాకతో తమిళనాడు రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు శశికళను పార్టీలోకి ఆహ్వానించే అవకాశమే లేదని తేల్చి చెప్పగా ఆమె రాజకీయ పయనం ఎటువైపు అనే ఆసక్తి నెలకొంది.

చిన్నమ్మ విడుదల.. ఆసుపత్రిలోనే ఫార్మాలిటీస్ పూర్తి!