శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పై దాడి

74

కర్ణాటక శాసనమండలిలో పెద్ద రచ్చ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీ బాహాబాహీకి దిగారు. కాగా మండలి చైర్మన్ ప్రతాప్ చంద్రశెట్టి ఆ పదవి నుంచి దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ ప్రతాప్ చంద్రశెట్టిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది బీజేపీ. దింతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీఎస్ కలిసి చైర్మన్ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఆరోపిస్తూ డిప్యూటీ స్పీకర్ పై దాడికి దిగారు.

బలం లేకుండా బీజేపీ అవిశ్వాస తీర్మానం ఎలా పెట్టిందో తెలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. 75 మంది ఉన్న సభలో 36 మంది బలం ఉంటేనే చైర్మన్ పదవి దక్కుతుందని. కానీ వాటిని పట్టించుకోకుండా 31 మంది సభ్యుల బలంతో బీజేపీ అవిశ్వాస తీర్మానం ఎలా ప్రవేశపెడుతుందని ప్రశ్నించారు. జేడీఎస్ ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేసి, చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని కాంగ్రెస్ సభ్యలు మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ ను పక్కకు లాగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. కొద్దీ సేపు అక్కడ పరిస్థితి ఎవరికీ అర్ధం కాలేదు.

 

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పై దాడి