తెలంగాణ మంత్రులపై సర్పంచ్ ల తిరుగుబాటు.

333

తెలంగాణలో సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అలిమికాని హామిలి ఇచ్చిన సర్పంచ్ లు ఇప్పుడు వాటిని అమలు చెయ్యలేక ఇబ్బంది పడుతున్నారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా సరిగా రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడింది. కొన్ని గ్రామాల్లో నిధులు వస్తాయనే ఆశతో సర్పంచ్ లు తమ సొంత డబ్బు పెట్టి సిసిరోడ్లను వేయించారు. అయితే నెలలు గడుస్తున్న బిల్లులు రావడం లేదు.

సర్పంచ్ లపై కాంట్రాక్టర్ల ఒత్తిడి పెరిగింది. దింతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సర్పంచ్ లు. ఇక ఇప్పటికే ఇద్దరు సర్పంచ్ లు నిధులు విడుదల కాక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లను నిలదీశారు. పంచాయితీరాజ్ సమ్మేళనంలో భాగంగా మంత్రులు మహబూబ్ నగర్ పట్టణ శివార్లలో గల ఓ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక ఇదే రోజు సర్పంచ్ లు ఛలో పాలమూరు కార్యక్రమం చేపట్టారు సర్పంచ్ లు. మంత్రుల కార్యక్రమానికి ర్యాలీగా తరలి వచ్చి ఫంక్షన్ హల్ ముందు బైఠాయించారు.

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దింతో వారికీ నచ్చచెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ లను ఫంక్షన్ హాల్ లోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన సర్పంచ్ లు కుర్చీల్లో కూర్చుకుండా నేలపై కూర్చొని నిరసన తెలియచేశారు. తామసమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దింతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.