ఓటు వేసి.. బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

261

ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. శనివారం ఉదయం 6:30 మొదలైన పోలింగ్, సాయంత్రం 3:30 కి ముగిసింది. ఇదిలా ఉంటే సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓ మహిళా అభ్యర్థి పోలింగ్ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తోన్న కనకదుర్గ ఉదయం ఓటు వేశారు. కొద్దీ సేపు పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఇంతలోనే పురిటినొప్పులు రావడంతో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆడశిశువుకు జన్మనిచ్చారు. కాగా నిండు గర్భినిగా ఉన్న కనకదుర్గ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ రోజే ప్రసవించారు.

ఓటు వేసి.. బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి