నా భర్త అందరికి ప్రేరణ : సంతోష్ బాబు భార్య

304

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఇక్కడే ట్రైనీ కలెక్టర్ గా పనిచేస్తున్న గాల్వాన్ అమరవీరుడు బిక్కుమళ్ల సంతోష్ బాబు సతీమణి సంతోషిని కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్బంగా సంతోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన భర్తకు మహావీర్ చక్ర పురష్కారాన్ని ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారని సంతోషి అన్నారు. తమ పిల్లలు ఎంతో గర్వపడుతున్నారని తెలిపారమే, మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారామే. కార్యక్రమంలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నా భర్త అందరికి ప్రేరణ : సంతోష్ బాబు భార్య