కోనసీమలో మొదలైన కోడిపందాలు

60

సంక్రాంతికి 20 రోజుల ముందే కోడిపందాల హడావిడి మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలకర్రు గ్రామంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందానికి సిద్ధం చేసిన పుంజులను రంగంలోకి దింపి పోలీసులకు తెలియకుండ గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలిసింది. దీంతో ఆయన ఏలూరు రూరల్ పోలీసులకు తెలిపారు. దింతో దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ దాడితో జిల్లాలో కోడి పందాలు నిర్వహించేవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమనేప్పుడు అదుపులోకి తీసుకుంటారో అన్న భయంతో కోడి పందాలనే మానేసినట్లు తెలుస్తుంది. ఇక కోడి పందాలు ఆడుతూ పట్టుబడిన వారి నుంచి 5000 నగదు, 29 మోటర్ సైకిళ్ళు 11 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. మరో 20 సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

కాగా సంక్రాంతి సంబరాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. దింతో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఎద్దుల పందాలు, జల్లి కట్టుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కోడి పందాలు నిర్వహించినట్లు తెలుస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పందాలు ఆడుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు అధికారులు.