చైనాకు శామ్‌సంగ్ ఝలక్.. చైనా నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలింపు

96

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ చైనాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. తన మొబైల్, ఐటి డిస్ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించనుంది. ఈ సంస్థ ఉత్తర ప్రదేశ్‌లో రూ .4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు యుపి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, నోయిడాలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి శామ్‌సంగ్ ‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దేశంలోనే శామ్‌సంగ్ మొదటి హై-టెక్నిక్ ప్రాజెక్ట్ అవుతుందని యుపి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఇది ప్రపంచంలోనే మూడవ యూనిట్ అవుతుందని కూడా చెప్పారు. బిజినెస్‌టుడే.ఇన్ ప్రకారం , నోయిడాలో ఏర్పాటు చేసే నూతన యూనిట్ ద్వారా పరోక్ష ఉపాధి కాకుండా 510 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నారు. శామ్‌సంగ్ ఇప్పటికే నోయిడాలో మొబైల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని 2018 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.