ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన సజ్జల

142

సుప్రీం కోర్టు తీర్పుతో ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా మార్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమారు. ఇదిలా ఉంటే ఎన్నికల విషయంపై మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశామని వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాకు పిటిషన్ వేసిందని, తమకు ఎటువంటి దురుద్దేశం లేదని తెలిపారు.

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సజ్జల. రాజ్యాంగ వ్యవస్థలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. ఇగో ఉంటే ఎన్నికల కమిషన్ కు ఉండాలని తమకేమి లేదని రామకృష్ణా రెడ్డి అన్నారు. పరిస్థితిలు అనుకూలంగా ఉన్నప్పుడు వాయిదా వేసి, ప్రతికూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు జరపడాన్ని తాము వ్యతిరేకించామని, ఇదే విషయాన్నీ కోర్టుకు వివరించామని తెలిపారు. కోర్టు ఎన్నికలు జరపాలని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామని అన్నారు.

ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన సజ్జల