జగన్ పై జాతీయ మీడియా అసత్య కథనాలు. – సజ్జల

15192

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఓ జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుందంటూ కథనాలు ప్రసారం చేసిందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరు ద్వేషించడం లేదని, వ్యతిరేకత కూడా వ్యక్తపరచడం లేదని సజ్జల అన్నారు. చంద్రబాబు నాయుడు బినామీ ఛానల్ లో ఓ జాతీయ మీడియా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇదే విధంగా కథనాలు అల్లారని, అవాస్తవాలను వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 4న జగన్‌ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైఎస్సార్సీపీపై తప్పుడు కధనాలు బాధాకరమన్నారు. ఇకనైనా తప్పుడు కథనాలను మానుకోవాలని హెచ్చరించారు సజ్జల.

జగన్ పై జాతీయ మీడియా అసత్య కథనాలు. – సజ్జల