భార్యను అమ్మకానికి పెట్టిన శాడిస్ట్ భర్త

59

భార్య భర్తల బంధం ఈ సృష్టిలోని అన్ని బంధాలకంటే పవిత్రమైనది. కానీ ఆ పవిత్రతనే మంటగలిపాడు ఓ భర్త. భార్య ఫొటోస్ ఆన్ లైన్ లో పెట్టి కాల్ గర్ల్ అంటూ ఫోన్ నంబర్ పెట్టాడు. గంటకు ఇంత ఛార్జ్ అని ఆన్ లైన్ లో ఫోటోతోపాటు ఫోన్ నంబర్ పెట్టి పోస్ట్ చేశాడు. అది చాలదన్నట్లు తన స్నేహితులకు ఫోన్ చేసి మరి చెప్పాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. కాగా ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.

వివరాల్లోకి తిరుపతి పట్టణంలో నివాసం ఉండే రేవంత్ కి, నిరోషా అనే యువతికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త రేవంత్ నిరోషాను వేధించడం మొదలు పెట్టాడు. శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. అంతటితో ఆగని రేవంత్ ఏకంగా భార్య ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఈమె కాల్ గర్ల్ అంటూ పోస్ట్ చేశాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నిరోషాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా రేవంత్ ఎస్జీఎస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. కాగా పెళ్లి సమయంలోనే భారీగా కట్నం సమర్పించారు. అయిన రేవంత్ వికృత వేషాలు వేసి భార్యను అంగడి సరుకుల ఆన్ లైన్ పెట్టాడు.

భార్యను అమ్మకానికి పెట్టిన శాడిస్ట్ భర్త