చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం

146

చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు హనుమంత రెడ్డి (45) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యం భారినపడటంతో ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ హనుమంతరెడ్డి గురువారం ఉదయం మృతి చెందారు. రేపు తుమ్మలగుంటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హనుమంత రెడ్డి మృతితో స్వగ్రామం తుమ్మలగుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.