ఆర్ఎస్ఎస్ లో విషాదం.. సిద్ధాంతకర్త మృతి

160

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంత కర్త, సంస్కృత భాషా పండితుడు ఎంజీ బాబూరావ్ వైద్య (97) శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వైద్య.. ఈ నేపథ్యంలోనే ఆయనకు నాగ్ పూర్ లోని స్పందన ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కాగా వైద్య అంత్యక్రియలు నాగ్‌పూర్‌లోని అంబజారీ ఘాట్‌లో ఆదివారం జరగనున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎంజీ వైద్యకి నివాళులు అర్పించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు వైద్య అందించిన సేవలు అమితమైనవి కొనియాడారు. వైద్యకు సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గే వార్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ్‌ సైద్ధాంతిక నిర్మాణంలో వైద్య పాత్ర కీలకమైనది. ఆయన చివరి శ్వాస వరకు సంఘ్‌ ఆశయాల కోసం జీవితాన్ని అంకితం చేశారు. జర్నలిస్టులుగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈయన మృతి సంఘ్ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచేసింది.

ఆర్ఎస్ఎస్ లో విషాదం.. సిద్ధాంతకర్త మృతి