కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి

355

కేరళలోని అలప్పుజ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నందుని స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కు చెందిన వ్యక్తులు హత్య చేశారు. ఆర్ఏస్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని సుమారు 20 మంది మూకుమ్మడి దాడి చేశారు. దింతో నందు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఫిబ్రవరి 23న కేరళలో విజయ యాత్ర ప్రారంభించింది బీజేపీ, ఈ యాత్రకు యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కు సంబందించిన కొందరు యోగి సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే అప్పుడు కొందరు బీజేపీ నేతలు అడ్డుకోని వారిని వెనక్కు పంపారు. సభ పూర్తైన మరుసటి రోజే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్య చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక కేరళలో బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు హత్య గావించబడటంతో ఇది మొదటి సారి ఏమి కాదు.. అనేక సార్లు బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. ఎంతోమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, ఎల్డీఎఫ్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక నందు మృతికి నిరసనగా గురువారం అలప్పుజ జిల్లాలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు.

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య