#RS91: సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజశేఖర్ ట్విస్ట్!

192

#RS91: హీరో రాజశేఖర్ అంటే తెలుగు సినిమాలలో యాంగ్రీ మెన్ గానే కాదు.. ఒకనాడు అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. నిండైన ఉంగరాల జుట్టూ ఎప్పుడూ మొహం మీద తొణికసలాడే చిరు నవ్వుతో అప్పట్లో అమ్మాయిల మనసును గిల్లేశాడు. అయితే అంకుశం లాంటి సినిమాలలో ఆయన ఫైరింగ్ చూసిన ఇండస్ట్రీ ఆయనకు యాంగ్రీ మెన్ గానే పిలుచుకుంది. కాగా.. రాజశేఖర్ ఈ మధ్య సక్సెస్ లేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగతో మళ్ళీ సక్సెస్ బాటపట్టిన రాజశేఖ‌ర్ కల్కి మూవీతో పర్వాలేదనిపించుకున్నాడు.

కానీ ఈసారి ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్న రాజశేఖర్ స్టైల్ మార్చి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో ముందుగా కోవిడ్ స‌మ‌యంలో తాను చావు అంచుల వ‌ర‌కు వెళ్లి వ‌చ్చాన‌ని, అయితే ఆ దేవుడితో పాటు ప్రేక్ష‌క దేవుళ్ల ఆద‌రాభిమానాలతో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపారు‌. తర్వాత తన 91వ సినిమాగా ‘శేఖ‌ర్‌’లో నటించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మేన్ విత్ స్కేర్(భయం కలిగి ఉన్న మనిషి అనే అర్థం) అనే ట్యాగ్ పెట్టిన ఈ సినిమాను లలిత్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.

ఈ సినిమా పోస్టర్ విడుదల చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో గుబురు గడ్డంతో ఉన్న హాఫ్ పేస్ రివీల్ చేశారు. రాజశేఖర్ ఇలా కనిపించడంతో ఆయన అభిమానులలో జోష్ మొదలైంది. కాగా ఈ సినిమా మ‌లయాళ చిత్రం జోసెఫ్‌కు తెలుగు రీమేక్ అని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. జీవిత‌నే సినిమాను డైరెక్ట్ చేస్తుంద‌ని ముందుగా వార్త‌లు వినిపించినా చివ‌ర‌కు ల‌లిత్ అనే యువ‌కుడు సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభ‌మైందని ప్రకటించారు.

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజశేఖర్ ట్విస్ట్!