భాగ్యనగరాన్ని కోల్పోయిన ఏపీకి రూ.1400 కోట్లు!

246

ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో ఏపీ ప్రజలు ఎక్కువగా బాధ పడిన అంశం హైదరాబాద్. అప్పటి వరకు తారతమ్య బేధాలు లేకుండా భాగ్యనగరంతో పెనవేసుకున్న బంధాన్ని వదులుకునేందుకు ఏపీ ప్రజలు ఇష్టపడలేదు. తెలుగు రాష్ట్రం విడిపోతుందనే బాధ కన్నా హైదరాబాద్ ఇకపై తమ రాష్ట్రంలో భాగం కాదన్నా బాధే వారిని కలచివేసింది. రాష్ట్రంలో విడిపోయే సమయంలో నష్టపోయిన ఏపీకి ఎన్నో చేస్తాం.. మిమల్ని ఆదుకుంటామని అప్పటి కేంద్రం చాలానే హామీలు ఇచ్చింది. విభజన చట్టం అని ఒకటి చేసి ఇదే ఏపీ ప్రజల బాధను తీర్చే సంజీవనిగా చెప్పింది. ఆ చట్టంలో పేర్కొన్న వాటిలో ఒక్కటంటే ఒక్కటీ ఇప్పటికీ నెరవేర్చలేదు.

ఇక.. హైదరాబాద్ మహానగరాన్ని.. ఆ నగరంతో ఏపీ ప్రజల అనుబంధానికి.. అప్పటి వరకు తమ నగరంగా అభివృద్ధిలో భాగమైన విలువకు త్వరలోనే ఒక గ్రాంటు దక్కనుంది. అది కూడా హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన మాకు విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం నిధులు కోరడంతో 15వ ఆర్థిక సంఘం హైదరాబాద్ వదులుకున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు విశాఖకు రూ.1400 కోట్లు గ్రాంట్​ను సిఫార్సు చేసింది. విశాఖలో మౌలిక వసతుల కల్పనకు రాబోయే ఐదేళ్లలో ఇవి విడుదల కానున్నాయి. విశాఖను ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దాలని.. రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది.