RRR Update: ఫోటోలు లీక్.. జక్కన్నకు షాక్!

206

RRR Update: వందల కోట్ల బడ్జెట్.. వెండి తెర మీద చూస్తే కానీ పండని సీన్స్.. ఆ క్రేజీ ఎలివేషన్స్.. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.. అంతకు మించిన కాంబినేషన్.. ఒక్కో సినిమా మీద ఆ సినిమా దర్శక, నిర్మాతలు పెట్టుకునే హోప్స్ అన్నీ ఇన్నీ కావు. కానీ లీకు వీరులు ఒక్క దెబ్బతో అన్నీ నాశనం చేస్తున్నారు. సినిమాకు సినిమాలే లీకులు చేసిన ఆ మహానుభావులు ఇప్పుడు ఏకంగా ఇండియన్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ మీద పడ్డారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫోటోలే దర్శనమిస్తున్నాయి.

ఈ ఫోటోలలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న‌ ఎన్టీఆర్.. సంకెళ్ళు తెంచుతున్న‌ట్టుగా కనిపిస్తుంటే.. మరో ఫోటోలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఒలీవియా, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది. జ‌క్క‌న్న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా సినిమా నుండి ఇలాంటి స్టిల్స్ కావ‌డం చిత్ర బృందాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. మరోవైపు తమ అభిమాన హీరోలు ఎలా ఉంటారా అని ఎదురుచూస్తున్న అభిమానులు కొందరు ఈ ఫోటోలను చూసి హ్యాపీ ఫీల్ అయినా చిత్ర బృందం మాత్రం విచారం వ్యక్తం చేస్తుంది.

1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెండు నిజ‌మైన పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీగా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడి, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ స్టంట్ దర్శకుడితో క్లైమాక్స్ షూట్ చేసున్న జక్కన్న ఈ లీకులతో మరింత జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంది. మరి సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమా ఈ లీకుల నుండి ఎలా బయటపడుతుందో ఏమో!