‘RRR’ ప్రమోషన్ కోసం జక్కన్న కొత్త ప్లాన్!

320

‘RRR’: ఇప్పుడు టాలీవుడ్ లో గ్రాండ్ సినిమా ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ ముందుగా చెప్పుకోవాలి. మెగాస్టార్ నుండి సూపర్ స్టార్ వరకు చాలా సినిమాలే ఉన్నా ఆర్ఆర్ఆర్ మాత్రం స్పెషల్ అనే చెప్పుకోవాలి. అసలే బాహుబలి లాంటి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా కావడం ఒకటైతే.. అటు నందమూరి.. ఇటు మెగా హీరోలను కలిపి ఒకే తెరమీద చూపించడం మరో ఎత్తు. అయితే.. ఇదంతా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాగా.. మొత్తం ఐదు బాషలలో ఈ సినిమా రిలీజ్ కానుండడంతో ఆయా బాషల నటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ఈ ఇండియన్ సినిమాపై మెగా-నందమూరి అభిమానులు కొండత ఆశలు పెట్టుకోగా.. బడ్జెట్ కూడా కొండంత కావడం ఖాయంగా కనిపిస్తుంది. సహజంగానే దర్శకుడు రాజమౌళి సినిమా తెరకెక్కించడమే కాదు.. సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే సినిమా విడుదలను చాలా సమయమే ఉన్నా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ మాత్రం త్వరలోనే స్టార్ చేయాలని చూస్తున్నాడట. మొత్తం ఐదు బాషలలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రమోషన్స్ కూడా ఐదు బాషలలో ఒకేసారి స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట.

‘RRR’ ప్రమోషన్ కోసం జక్కన్న కొత్త ప్లాన్!