హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య

15140

నగరంలో హత్య ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడీ షీటర్ ను దారుణంగా హత్య చేశారు. మహమ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు డాన్‌పై కత్తులతో దాడి చేసి అంతం మొందించారు. రెయిన్ బజార్ పి ఎస్ పరిధిలోనీ చోట పుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు తల్వార్, డగర్ లతో అతికిరాతకంగా పర్వేజ్‌ను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ పోలీసులు… వివరాలు సేకరిస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ గజ రాజు భూపాల్ కూడా చేరుకొని హత్యకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆధిపత్య పోరే పర్వేజ్ హత్యకు దారి తీసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య