నిమ్మగడ్డపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

141

ఏకగ్రీవాలపై నివేదిక ఇవ్వాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ఆదేశాలపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుండటంతో నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు వేసి తమ పాలకుడిని ఇంచుకోవాలని చెబుతున్నారు. మొదటి నుంచి నిమ్మగడ్డ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. భారీ సంఖ్యలో పంచాయితీలు పోటీ లేకుండా ఏకగ్రీవం అవుతుండటంతో వాటిపై దృష్టిపెట్టి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

కాగా పంచాయితీ ఏకగ్రీవమైతే ప్రభుత్వం రూ. 20 లక్షల రూపాయల నజరానా ఇస్తామన్న విషయం తెలిసిందే.. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో నజరానా ప్రస్తావన ఎక్కడ తీసుకురావడం లేదు నేతలు. అయితే ఏకగ్రీవాలు మొత్తం వైసీపీ బలపరిచిన అభ్యర్దులవే కావడంతో అధికారపార్టీ ప్రలోభాలకు దిగుతుందని నిమ్మగడ్డ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సజావుగా ఎన్నికలు నిర్వహించాలని, ప్రలోభాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ వాచ్ యాప్ ను తీసుకొచ్చారు. కానీ దీనిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. 9 తేదీ వరకు ఈ యాప్ వాడకూడదని తేల్చి చెప్పింది.

నిమ్మగడ్డపై రోజా తీవ్ర వ్యాఖ్యలు