రోహిత్ ను ఆస్ట్రేలియా పంపండి – సచిన్

104

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ లలో రోహిత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే రోహిత్‌ శర్మ తన సహచరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్‌నెస్‌ సమస్య కారణం కాదని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లకపోవడానికి కారణం తన తండ్రి ఆరోగ్య పరిస్థితే అని బోర్డ్ వివరణ ఇచ్చింది.

రోహిత్ ను ఆస్ట్రేలియా పంపండి – సచిన్

తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్‌ ఐపీఎల్‌ తర్వాత నేరుగా ముంబైకి వచ్చాడని, ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి ఎన్‌సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడని తెలిపింది. కాగా తాజాగా రోహిత్ విషయంపై సచిన్ టెండూల్కర్ స్పందించారు. రోహిత్‌ ఫిట్‌నెస్‌గా ఉన్నాడా.. లేదా అనేది అతనితో పాటు బోర్డుకు మాత్రమే తెలియాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ టెండూల్కర్‌ అన్నారు.

ఒకవేళ రోహిత్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు పంపాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు. 100 శాతం ఫిట్ నెస్ ఉంటే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు పంపడం ఉత్తమమని తన అభిప్రాయం వెల్లడించారు. రోహిత్ మంచి ఓపెనర్ అని అతడు జట్టులో ఉంటె సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.