ఫిట్ నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్, ఆస్ట్రేలియా పయనం

80

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పరీక్షలో నెగ్గారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో రోహిత్ నెగ్గారు. కాగా ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో గాయపడిన రోహిత్ ను మొదట ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఆ తర్వాత ఐపీఎల్ చివరి మ్యాచ్ లలో ఆడి తాను ఫిట్ గా ఉన్నాను అని హిట్ మ్యాన్ నిరూపించుకోవడంతో అతడిని కేవలం టెస్ట్ జట్టుకు ఎంపిక చేసారు.

ఇక ఈ నేపథ్యంలోనే తన ఫిట్ నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ తెలపడంతో ఎన్‌సిఎ చీఫ్ రాహుల్ ద్రవిడ్ ఎదుట అవసరమైన పరీక్షలను క్లియర్ చేసాడు. త్వరలో రోహిత్ ఆస్ట్రేలియా బయలుదేరనున్నారు. కాగా ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత రోహిత్ 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. దింతో అతడు తోలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నారు. జనవరి 7 న ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ బ్యాట్ పట్టనున్నారు.

 

ఫిట్ నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్, ఆస్ట్రేలియా పయనం