12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు..

227

దేశంలో 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోహింగ్యా ముస్లింలు ఆగ్రామంగా నివాసం ఉంటున్నారని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతోపాటు మరికొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభకు తెలిపారు. వీరంతా సరైన పత్రాలు లేకుండానే దేశంలో ప్రవేశించినట్లు తెలిపారు. సభలో సభ్యలు అడిగిన అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

అయితే అక్రమ పద్దతిలో దేశంలోకి ఎంతమంది వచ్చారనే సమాచారం లేదని తెలిపారు. జమ్మూకశ్మీర్‌, తెలంగాణ, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రోహింగ్యా ముస్లింలు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరినీ గుర్తించి, దేశం నుంచి పంపడం వారి జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ తర్వాతే నిరంతరంగా సాగుతుందని చెప్పారు.