కరోనా మరణాలకంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ

151

ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రోజుకు కొన్ని వందలమంది మృతి చెందుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. ఇక దేశంలో చూసుకుంటే కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వలన మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలో దేశంలో కరోనాతో 1.45 లక్షల మంది మరణిస్తే రోడ్డు ప్రమాదాల వలన 1 లక్ష 51 వేలమంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతున్నాయి.

కరోనా మహమ్మారి కంటే రోడ్డు ప్రమాదాలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించడంపైనే దృష్టి పెట్టాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో 55శాతం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలిగినట్టు గడ్కారీ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదాల్లో యువతే అధికంగా మృతి చెందుతున్నారని వివరించారు. హెల్మెట్ ధరించకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు.

కరోనా మరణాలకంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ