ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత దుర్మరణం

80

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొనడంతో.. టంగుటూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రావూరి అయ్యవారయ్య దుర్మరణం చెందారు. అలాగే మండల కన్వీనర్ శ్రీహరికి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రకాశం జిల్లా చెరువుకొమ్ము పాలెం వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు ముగించుకొని ఒంగోలుకు బయలుదేరారు అయ్యవారయ్య.

అయితే మార్గం మధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అయ్యవారయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన వెంట ఉన్న శ్రీహరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి శ్రీహరిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.